Hyderabad | డబ్బుల కోసం కన్న కొడుకే కిడ్నాప్ డ్రామా.. 40 ఏళ్ల ప్రియురాలితో కలిసి పాతికేళ్ల కుర్రాడి స్కెచ్
Hyderabad | మియాపూర్, ఫిబ్రవరి 26: కూలీనాలీ చేసి కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు ఆశపడితే... ఆ తనయుడు మాత్రం వారినే నిండా ముంచేందుకు ప్రయత్నించాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజేందుకు ఓ మహిళతో కలిసి కిడ్నాప్ నాటకం ఆడాడు.
Hyderabad | మియాపూర్, ఫిబ్రవరి 26: కూలీనాలీ చేసి కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు ఆశపడితే… ఆ తనయుడు మాత్రం వారినే నిండా ముంచేందుకు ప్రయత్నించాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజేందుకు ఓ మహిళతో కలిసి కిడ్నాప్ నాటకం ఆడాడు. విషయం బోధపడక ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా కిడ్నాప్ నాటకం ఆడింది కుమారుడేనన్న నిజం వెలుగుచూసింది.
మియాపూర్ ఠాణా పరిధిలోని మక్తా హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో నివాసముండే సంజీవరావు మేస్త్రీ. ఆయన కుమారుడు కంకి పవన్‌కుమార్(25) ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన పవన్ రాత్రి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ మహిళ పవన్‌కుమార్ తల్లికి ఫోన్ చేసి రూ.50 వేలు డిమాండ్ చేసింది.
డబ్బులు ఇవ్వకపోతే కుమారుడిని చంపేస్తానని హెచ్చరించింది. సదరు ఫోన్ నంబర్ సిగ్నల్ ఆధారంగా మియాపూర్ డీఐ కాంతారెడ్డి నేతృత్వంలోని క్రైం బృందం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా తన ప్రియురాలు రాధిక(40)తో కలిసి కంకి పవన్ కుమార్ కిడ్నాప్ డ్రామా ఆడి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు గుంజాలని ప్రణాళిక వేసినట్లు వెల్లడైంది. ఫోన్‌కాల్ వచ్చిన ఆరు గంటల వ్యవధిలోనే పవన్‌కుమార్, రాధికను క్రైం డీఐ కాంతారెడ్డి, పోలీసు బృందం అదుపులోకి తీసుకుని కిడ్నాప్ కథను సుఖాంతం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Hyderabad
- Kidnap
- Miyapur
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
‘ఓయూ, కేయూ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

