మాస్కో: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో.. ఉక్రెయిన్‌కు నాటో దళాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే నాటో దేశాలు పంపిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌తో రష్యా భూభాగంపై జరుగుతున్న దాడులు పెరిగాయి. దీన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్(Vladimir Putin) వ్యతిరేకించారు. పాశ్చాత్య దేశాల ఆయుధాలు వాడడం అంటే, నేరుగా నాటో దేశాలతో యుద్ధం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. అంటే రష్యాతో అమెరికా, దాని మిత్రదేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లు అవుతుందని పుతిన్ తెలిపారు. ఒవకేళ ఆ దేశాలు అలాగే తమ వెపన్స్‌తో దాడి చేస్తే, అప్పుడు స్పందన కూడా ఆ రేంజ్లో ఉంటుందని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే క్షిపణులను వాడడం అంటే నేరుగా ఉక్రెయిన్ సంక్షోభంలో తలదూర్చడమే అవుతుందని పుతిన్ తెలిపారు.
ఉక్రెయిన్ ఇటీవల తన దాడుల్లో పశ్చిమ దేశాలు అందజేసిన స్టార్మ్ షాడోస్, ఏటీఏసీఎంఎస్ లాంగ్రేంజ్ క్షిపణులతో దాడి చేసింది. క్రిమియాతో పాటు డాన్బాస్ ప్రదేశాల్లో జరిగాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన రష్యా భూభాగంపై ఇలాంటి క్షిపణులను వాడనున్నట్లు ఇటీవల అమెరికా, బ్రిటన్ ప్రకటించాయి. రష్యా భూభాగంపై ఇప్పటికే ఏరియల్ వెహికిల్స్‌తో ఉక్రెయిన్ అటాక్ చేస్తోందని, కానీ పశ్చిమ దేశాలకు చెందిన లాంగ్ రేంజ్ క్షిపణులను వాడే సామర్థ్యం ఉక్రెయిన్‌కు లేదని పుతిన్ తెలిపారు.
అయితే అలాంటి దాడులు చేయాలంటే, నాటో ఉపగ్రహాల ఇంటెలిజెన్స్ అవసరం ఉంటుందని, ఫైరింగ్ సొల్యూషన్స్ మాత్రం నాటో మిలిటరీ వ్యక్తులు మాత్రమే చేయగలరని పుతిన్ తెలిపారు. ఒకవేళ లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను వాడితే, అప్పుడు ఆ దేశాలు నేరుగా తమతో యుద్ధానికి దిగినట్లు అవుతుందన్నారు. పశ్చిమ దేశాలు నేరుగా పాల్గొనడం అంటే,అప్పుడు తాము కూడా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
‼️🇷🇺🏴☠️ President’s Response on the Potential Use of NATO Long-Range Weapons Against Russia
“This would mean that NATO countries, the United States, and European nations are at war with Russia. And if that is the case, considering the fundamental shift in the nature of this… pic.twitter.com/UO03dRUl44
— Zlatti71 (@Zlatti_71) September 12, 2024