వాషింగ్టన్, జనవరి 16: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు మంగళవారం ప్రకటించారు. పార్టీ అభ్యర్థిత్వం విషయంలో ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసన్ ఎన్నికల్లో వివేక్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. డొనాల్డ్ ట్రంప్ 51శాతం ఓట్లు సాధించగా, వివేక్ రామస్వామికి కేవలం 7.7 శాతం వచ్చాయి. ఫలితాల తర్వాత వివేక్ రామస్వామి మాట్లాడుతూ, ట్రంప్‌నకు తన మద్దతు ఉంటుందని తెలిపారు.