న్యూయార్క్: విమానాల్లో మూత్ర విసర్జనకు సంబంధించిన వివాదాలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణమయ్యాయి. తప్పతాగి ఒక ప్రయాణికుడిపై మరో ప్రయాణికుడు మూత్ర విసర్జన చేయడం, సీట్లోనే మూత్రం పోసుకోవడం ఇలా తరచూ ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
విమానం సిబ్బంది టాయిలెట్స్ వినియోగించుకోవడాన్ని నిరాకరించడంతో ఓ ఆఫ్రికా- అమెరికన్ మహిళ విమానం ఫ్లోర్‌పైనే మూత్ర విసర్జన చేసింది. అదేంటని ప్రశ్నించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రెండుగంటలపాటు అభ్యర్థించినా బాత్రూమ్కు వెళ్లకుండా అడ్డుకుంటే ఏం చేయాలని ప్రశ్నించింది. మూత్రం ఆపుకోలేకే ఫ్లోర్‌పై పోయాల్సి వచ్చిందని చెప్పింది.
ఈ ఘటనను ఓ ప్రయాణికుడు తన మొబైల్లో రికార్డు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 20న అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు ప్రయాణికురాలు మూత్రం కంపుకొడుతున్నదని, అందువల్ల ఆమెకు బాగా నీళ్లు తాగాలని సిబ్బంది సూచించారని, ఆమె అందుకు నిరాకరించడంతో వాళ్లు టాయిలెట్స్‌లోకి వెళ్లనివ్వలేదని ప్రాథమికంగా తెలుస్తున్నది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ జరుగుతన్నది.
🇺🇸 ÉCART CIVILISATIONNEL : 20/07/2023 Une Afro-américaine à bord d’un vol @SpiritAirlines urine sur le sol parce qu’elle ne veut pas attendre qu’ils ouvrent les toilettes après le décollage. Les hôtesses de l’air, quant à elles, lui disent qu’elle devrait boire de l’eau “parce… pic.twitter.com/EQbPGy0NFK
— Valeurs Occidentales (@ValOccidentales) July 21, 2023