ఒక మహిళ బిడ్డకు జన్మనిస్తోందంటే డాక్టర్లు, నర్సులు నానా తతంగం ఉంటుంది. అలాంటిది ఒక మహిళ మాత్రం పసిఫిక్ మహాసముద్రంలో ఎలాంటి మెడికల్ సహకారం లేకుండా బిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జోసీ ప్యూకర్ట్ (37) అనే యువతి షేర్ చేసిన వీడియోలో.. ఆమె నికారగువాలోని ప్లాయా మజగువాల్ సముద్ర తీరంలో బిడ్డకు డెలివరీ ఇచ్చింది.
ఎలాంటి మెడికల్ అసిస్టెన్స్ లేకుండా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు, ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె ఒక్కసారి కూడా స్కానింగ్ తీయించుకోలేదు. ‘‘ఇది పూర్తిగా సేఫ్గా జరిగేందుకు అవసరమైన రీసెర్చ్ అంతా చేసుకున్నాను’’ అని ఆమె చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.