న్యూఢిల్లీ : ఓ వ్యక్తి విచిత్ర హెయిర్‌స్టైల్ చూసి షాక్ తిన్న కోతి ఇచ్చిన రియాక్షన్ నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బైటెన్గిబిడెన్ ట్విట్టర్ ఖాతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతూ ఇప్పటివరకూ 30 లక్షలకు పైగా వ్యూస్‌ను రాబట్టింది.
If you need a laugh.. 😅 pic.twitter.com/05dO0n9aPm
— Buitengebieden (@buitengebieden) November 6, 2022
ఈ వీడియోలో క్యాప్ ధరించిన వ్యక్తి పక్కన మంకీ కూర్చుని ఉండగా, అతడు క్యాప్ తీయగానే విచిత్రమైన హెయిర్‌స్టైల్ కనిపిస్తుంది. అతడి హెయిర్‌స్టైల్‌ను చూసిన మంకీ షాక్‌కు గురై షేక్ అవడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. వారం ఆరంభంలో చికాకులన్నీ ఈ వీడియోతో మటుమాయమయ్యేలా మంకీ రియాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఏడాది పాటు తాను హెయిర్ కట్ చేయించికపోవడంతో తన తల్లి కూడా ఇదే తరహాలో రియాక్ట్ అయిందని ఓ యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చాడు.