USA Cop Brutality | అమెరికాలో రౌడీలా ప్రవర్తించిన పోలీస్.. క్యాన్సర్ పేషెంట్ అని చూడకుండా మహిళపై దాడి ! Video
USA Cop Brutality | అమెరికాలో ఓ పోలీస్ రౌడీలా ప్రవర్తించాడు..! ఓ మహిళను మెడపట్టి బలంగా నేలకు కొట్టాడు..! అనంతరం ఆమె పైకి లేవకుండా మోకాళ్లతో తొక్కిపెట్టాడు..! తాను మహిళనని, తనను టచ్ చేయొద్దని ఆమె అరుస్తున్నా పట్టించుకోలేదు..! క్యాన్సర్ పేషెంట్‌నని చెప్పినా వినిపించుకోలేదు..! పైగా ఆమె అరుపులు ఆపడానికి ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లాడు..!
లాస్ఏంజిల్స్: అమెరికాలో ఓ పోలీస్ రౌడీలా ప్రవర్తించాడు..! ఓ మహిళను మెడపట్టి బలంగా నేలకు కొట్టాడు..! అనంతరం ఆమె పైకి లేవకుండా మోకాళ్లతో తొక్కిపెట్టాడు..! తాను మహిళనని, తనను టచ్ చేయొద్దని ఆమె అరుస్తున్నా పట్టించుకోలేదు..! క్యాన్సర్ పేషెంట్‌నని చెప్పినా వినిపించుకోలేదు..! పైగా ఆమె అరుపులు ఆపడానికి ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లాడు..! ఆ తర్వాత చేతులకు సంకెళ్లు వేశాడు..! అమెరికా పోలీసులను తీవ్ర విమర్శలపాలు చేసిన ఈ ఘటన.. లాస్ ఏంజిల్స్ కౌంటీలోని లాంకస్టర్లోగల వింకో సూపర్ మార్కెట్ ఎదుట జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కిరాణ సరుకుల కోసం జూన్ 24న బాధిత మహిళ తన భర్తతో కలిసి వింకో సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ సామాను కొనుగోలు చేసి బయటికి వస్తుండగా సూపర్ మార్కెట్ సిబ్బంది వాళ్లను అడ్డగించారు. కొన్ని వస్తువులను బిల్లింగ్ చేయించకుండా తీసుకెళ్తున్నారని పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో పోలీసులు వచ్చి బాధితురాలి భర్తను బయటికి ఈడ్చుకెళ్లారు. పెనుగులాడుతున్న అతని చేతికి పోలీసులు సంకెళ్లు వేస్తుండగా.. సదరు మహిళ తన సెల్ఫోన్లో వీడియో తీయడం మొదలుపెట్టింది.
ఇది గమనించిన ఓ పోలీస్ అధికారి కోపంతో ఆమెవైపు పరుగెత్తుకొచ్చాడు. ఆమె మెడపట్టి బలంగా నేలకు కొట్టాడు. ఆపై ఆమె పైకి లేవకుండా మోకాళ్లతో తొక్కిపెట్టాడు. ఆమె అరుస్తూ గింజుకున్నా విడిచిపెట్టలేదు. పైగా అరవద్దంటూ ముఖంపై కొట్టాడు. అయినా ఆమె అరుపులు ఆపకపోవడంతో ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లాడు. ఆఖరి ఆమె చేతులకు సంకెళ్లు వేశాడు. భార్యభర్తలు ఇద్దరినీ కౌంటీ షరీఫ్‌కు తీసుకెళ్లి దొంగతనం కేసులో బుక్ చేశాడు. కాగా, పోలీస్ దౌర్జన్యాన్ని మరో మహిళ తన ఫోన్లో రికార్డు చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
This is Lancaster, California.
A Los Angeles county sheriffs deputy throws a Black woman to the ground and brutalized her for filming them arresting her husband.
Filming the police is not illegal.
This is brutality.
Arrest this pig. pic.twitter.com/BKg9dnZX7M
— Bishop Talbert Swan (@TalbertSwan) July 4, 2023
వీడియో చూసిన నెటిజన్లు పోలీస్ అధికారి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన భర్తకు సంకెళ్లు వేస్తున్న పోలీసులను వీడియో తీస్తే నేరమా..? అని ప్రశ్నిస్తున్నారు. రౌడీలా ప్రవర్తించిన పోలీస్ అధికారికి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఘటనపై విచారణ చేయిస్తున్నామని లాస్ ఏంజిల్స్ కౌంటీ మంగళవారం ప్రకటించింది. మహిళతో అనుచితంగా వ్యవహరించిన పోలీస్ అధికారితోపాటు మరో పోలీస్‌ను విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. అయితే ఆ రౌడీ పోలీస్ వివరాలు వెల్లడించేందుకు కౌంటీ నిరాకరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

