హ్యూస్టన్: ఇండియన్ అమెరికన్, డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు ఉషా రెడ్డి అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం డిస్ట్రిక్ట్ 22 సెనెటర్‌గా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. సెనెట్ డిస్ట్రిక్ట్ 22కు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉన్నదని ఉష ట్వీట్ చేశారు. 2013 నుంచి ఆమె మన్హాటన్ సిటీ కమిషన్‌కు సేవలందిస్తున్నారు.
రెండు సార్లు మేయర్‌గా పనిచేశారు. అంతకు ముందు మన్‌హట్టన్ ఆగ్డెన్ పబ్లిక్ స్కూళ్లలో పనిచేశారు. విద్యా నాయకత్వం అంశంలో కన్సాస్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఉష మాస్టర్ డిగ్రీ చేశారు.