వాషింగ్టన్: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి శ్వేతసౌధం శుభవార్త అందించింది. వాక్సినేషన్ పూర్తిచేసుకున్న వారికి వచ్చే నెల 8 నుంచి అమెరికాలోకి అనుమతిస్తామని శ్వేతసౌధ అధికార ప్రతినిధి తెలిపారు. ఎఫ్డీఏ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం పొందిన టీకాలను వేసుకున్న వారిని అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి అమెరికా ప్రయాణ ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే.