న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లో (New York) ఓ మహిళ తుపాకీతో హల్చల్ చేసింది. న్యూయార్క్ సమీపంలోని నాస్సౌ కౌంటీలో (Nassau County) 33 ఏండ్ల మహిళ తుపాకీని చేతపట్టుకుని నడిరోడ్డుపై తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఎదురుగా వస్తున్నవారికి గన్ను గురిపెడుతూ, గాలిలోకి కాల్చి హంగామా చేసింది. అంతటితో ఆగకుండా తన తలపైకి తుపాకీ గురిపెట్టుకుని చస్తానంటూ బెదిరించింది. ఆమెను పోలీసులు ఏం చేశారు, ఎలా పట్టుకున్నారో తెలుసా..
నస్సౌ కౌంటీలోని నార్త్ బెల్మోర్లో (Bellmore) మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఓ మహిళ తుపాకీతో రోడ్డుపై తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందంది. దీంతో వెంటనే అక్కడి వెళ్లారు. అయితే నడిరోడ్డుపై తుపాకీతో కాల్పులు జరుపుతూ హల్చల్ చేస్తున్నది. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దగ్గరికి వస్తే కాల్చుకుంటానంటూ పాయింట్ బ్లాక్లో తుపాకీ పెట్టుకుని రోడ్డు దాటుతుండగా.. పోలీసులు ఆమెను తమ వాహనంతో ఢీకొట్టి కింద పడేలా చేశారు.
అనంతరం అమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఆ మహిళ గాయపడిందని, ఆమెకు దవాఖానలో చికిత్స అందిస్తున్నామని నసౌ కౌంటీ పోలీస్ కమిషనర్ ప్యాట్రిక్ రైడర్ (Patrick Ryder) తెలిపారు. ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందనే విషయమై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆమెను బంధించిన పోలీసులను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Belmore Long Island, NY, a few moments ago .
A woman was waving a gun when Nassau County police took the person down. pic.twitter.com/4ym2KuJf7A— Viral News NYC (@ViralNewsNYC) August 15, 2023