Widest Tongue | టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బ్రిట్టనీ లకాయో 7.90 సెం.మీ(3.11 అంగుళాలు) నాలుకతో ప్రపంచంలోనే అతి వెడల్పైన నాలుక కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఆమె నాలుక దాదాపు క్రెడిట్ కార్డ్ అంత వెడల్పు ఉంది. గతంలో అమెరికాకే చెందిన ఎమిలీ షెలెంకర్ పేరిట ఈ రికార్డ్ (7.33 సెం.మీ) ఉండేది. బ్రిట్టనీ అటార్నీగా పని చేస్తున్నారు. తాను చిన్నతనంలో ఏదైనా తినడానికి ఆతృతగా నోరు తెరిచినప్పుడు తన నాలుక పెద్దదిగా ఉందని తన కుటుంబం జోక్ చేసేదని బ్రిట్టనీ చెప్పారు. తన బ్రెస్ట్ ఫ్రెండ్ సూచనతో తన నాలుక వెడల్పు కొలుచుకున్నప్పుడు తనది పెద్ద నాలుక అన్న విషయం తెలిసిందన్నారు.
నాలుక రంగుతో వ్యాధుల నిర్ధారణ!
బీజింగ్: నాలుక రంగును చూసి రియల్ టైమ్‌లో 98 శాతం కచ్చితత్వంతో వ్యాధులను గుర్తించే కృత్రిమ మేధ(ఏఐ) కంప్యూటర్ అల్గారిథమ్‌ను సృష్టించినట్టు ఇరాక్, ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు. అసోసియేట్ ప్రొఫెసర్ అలీ అల్-నజీ అధ్యయనం ప్రకారం మధుమేహ రోగుల నాలుక పసుపు రంగులో, క్యాన్సర్ రోగుల నాలుక తరచూ మందమైన పూతతో ఊదా రంగులో, బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో ఎరుపు రంగులో ఉంటుంది.
నాలుక చిత్రాల ద్వారా రోగమేదో కనిపెట్టడానికి చైనా సంప్రదాయ వైద్యం తనకు స్ఫూర్తిని ఇచ్చిందని నజీ తెలిపారు. 5,200 చిత్రాలను ఉపయోగించి నాలుక రంగును బట్టి వ్యాధిని నిర్ధారించడంలో ఈ ఏఐ నమూనాకు శిక్షణ ఇచ్చారు. చిత్రాలను బట్టి వ్యాధి ఏమిటో ఏఐ సరిగ్గా అంచనా వేసింది.