Sandwich | 7 డాలర్ల శాండ్విచ్ తిని పొరపాటున 7వేల డాలర్లు చెల్లించిన మహిళ.. చివరకు ఏమైందంటే
Sandwich | అమెరికాలో (US Woman) ఓ సబ్వే (Subway) రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళ 7 డాలర్ల శాండ్విచ్ (Sandwich ) తిని పొరపాటున 7 వేల డాలర్లు చెల్లించి వెళ్లిపోయింది.
Sandwich | అమెరికాలో (US Woman) ఓ సబ్వే (Subway) రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళ 7 డాలర్ల శాండ్విచ్ (Sandwich ) తిని పొరపాటున 7 వేల డాలర్లు చెల్లించి వెళ్లిపోయింది. ఆ తర్వాత తన పొరపాటును తెలుసుకున్న సదరు మహిళ.. ఆ సొమ్ము రిఫండ్ కోసం ఇప్పుడు తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది.
అమెరికాకు చెందిన వెరా కానర్ అనే మహిళ అక్టోబర్ 23వ తేదీన సబ్వే రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఓ శాండ్విచ్ను ఆర్డర్ చేసింది. ఆ శాండ్ విచ్ ఖరీదు రూ.7.54 డాలర్లు (రూ.628). దాన్ని తిన్న తర్వాత బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్లింది. అక్కడ తాను తిన్న దానికి రూ.7.54 డాలర్లు చెల్లించాలనుకుంది. అయితే రెస్టారెంట్ రివార్డు పాయింట్ల కోసం తన మొబైల్ నెంబర్లోని చివరి ఆరు నెంబర్లను ఎంటర్ చేసింది. అయితే ఆ మొబైల్ నెంబర్ కూడా అనుకోకుండా బిల్లు అమౌంట్లో కలిసిపోయి మొత్తం 7,105.44 డాలర్లు చెల్లించింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.6 లక్షలన్నమాట. ఈ విషయాన్ని ఆ మహిళ గమనించుకోలేదు. ఈ మొత్తాన్ని అమెరికన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే వారం రోజుల తర్వాత క్రెడిట్ కార్డు బిల్లు రాగా.. దాన్ని చూసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయ్యింది. సబ్ వేలో తాను రూ.5.91 లక్షలు టిప్ ఇచ్చినట్టు తెలుసుకుని నివ్వెరపోయింది.
ఇక వెంటనే ఆమె బ్యాంక్ ఆఫ్ అమెరికా వద్దకు పరుగులు పెట్టింది. అక్కడ అధికారులతో తన సమస్యను చెప్పి తన సొమ్మును రిఫండ్ చేయాల్సిందిగా కోరింది. అందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా తిరస్కరించింది. దీంతో ఆమె సబ్వే మేనేజ్మెంట్ను ఆశ్రయించింది. అయితే వారు బ్యాంకును ఆశ్రయించాలని సూచించారు. తిరిగి బ్యాంక్‌కు వెళ్లగా.. విచారణ జరిపించి సొమ్ము రిఫండ్ అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బ్యాంకు వాళ్లు సదరు సబ్వేని సంప్రదించగా.. వారు సానుకూలంగా స్పందించారు. ఆ మహిళ పొరపాటున చెల్లించిన టిప్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు అంగీకరించడంతో ఆమె కాస్త ఊపిరి పీల్చుకుంది.
Also Read..
Ileana DCruz | నేను సింగిల్ పేరెంట్ కాదు.. తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఇలియానా
Sabarimala Temple | శబరిమలలో భక్తుల రద్దీ.. నిన్న ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న 70 వేల మంది
Mansoor Ali Khan | మన్సూర్ క్షమాపణలు చెప్పడంపై త్రిష రియాక్షన్ ఇదీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

