ఉక్రెయిన్‌కు కాదు.. స్కూళ్ల భద్రతకు నిధులివ్వండి: ట్రంప్
హూస్టన్: ఉక్రెయిన్‌కు నిధులను ఇవ్వడం కాదు.. దేశంలోని స్కూళ్లలో భద్రతను పెంచేందుకు నిధులను కేటాయించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. కొన్ని రోజుల క్రితం టెక్సాస్‌లో ఓ ఉన్మాది స్కూల్లోకి ప్రవేశించి 19 మంది విద్యార్థులను కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ హూస్టన్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు బిలియన్ల డాలర్లను ఇవ్వగలిగినప్పుడు, మన ఇంట్లో మన పిల్లల్ని సురక్షితంగా ఉంచేందుకు కూడా అన్న చర్యలు చేపట్టాలన్నారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో ట్రిలియన్ల డాలర్లను ఖర్చు చేశామని, కానీ అక్కడ ఏమీ లభించలేదని ట్రంప్ అన్నారు. ప్రపంచ దేశాలను చక్కదిద్దడం కన్నా ముందు మన దేశంలోని స్కూళ్లను పిల్లలకు సురక్షితంగా ఉండేలా మార్చుకోవాలన్నారు. కఠిన తుపాకీ చట్టాల అమలును ట్రంప్ వ్యతిరేకించారు. తమల్ని తాము రక్షించుకునేందుకు ఆయుధాలు అవసరమని ఆయన అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

