US Secret Service | అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడికి భద్రత కల్పించే సీక్రెట్ సర్వీస్ విభాగం (US Secret Service)లోని ఓ సభ్యుడిని కొందరు దొంగలు దోచుకోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రెసిడెంట్ జో బైడెన్ కాలిఫోర్నియా పర్యటన సందర్భంగా ఈ ఘటన వెలుగు చూసింది.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి గత శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) లాస్ ఏంజెల్స్‌లో ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా స్థానిక పోలీసులతోపాటు యూఎస్ సీక్రెట్ సర్వీస్ విభాగం అధ్యక్షుడి భద్రతను చూసుకుంది. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్తున్న ఓ సీక్రెట్ ఏజెంట్‌ను కొందరు దుండగులు దారిలో అడ్డగించి దోచుకున్నారు. టూస్టిన్ అనే ప్రాంతంలో తుపాకీతో బెదిరించి అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనను సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ గుగ్లెమొనీ ధ్రువీకరించారు. ఈ ఘటనలో సీక్రెట్ ఏజెంట్ తన వద్ద ఉన్న సర్వీస్ గన్‌తో ఫైరింగ్ కూడా చేసినట్లు చెప్పారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Priyanka Gandhi | వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ : రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు
Sonakshi Sinha | ఈ నెల 23న పెళ్లి.. బ్యాచిలర్ పార్టీ చేసుకున్న సోనాక్షి సిన్హా.. ఫొటోలు వైరల్