Sonakshi Sinha | ఈ నెల 23న పెళ్లి.. బ్యాచిలర్ పార్టీ చేసుకున్న సోనాక్షి సిన్హా.. ఫొటోలు వైరల్
Sonakshi Sinha | బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) పెళ్లి వార్తలు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనాక్షి, జహీర్ ఇక్బాల్ తమ ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ (bachelorette) చేసుకున్నట్లు తెలుస్తోంది.
Sonakshi Sinha | బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) పెళ్లి వార్తలు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal)తో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ జంట ఈ నెల 23న పెళ్లిపీటలెక్కబోతోందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే, పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఇక పెళ్లికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో సోనాక్షి, జహీర్ ఇక్బాల్ తమ ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ (bachelorette) చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చినట్లు సమాచారం. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ జంట వివాహం నిశ్చయమైనట్లు తెలిసింది. ముంబయి శివారులోని విలాసవంతమైన రిసార్ట్‌లో పెళ్లి జరగనుందని సమాచారం. వీరి వివాహ ఆహ్వాన పత్రిక మ్యాగజైన్ కవర్ పేజ్ థీమ్‌తో రూపొందించినట్లుగా తెలిసింది. దానిపై ‘ది రూమర్స్ ఆర్ ట్రూ.. (పుకార్లు నిజమే)’ అనే క్యాప్షన్‌తో ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను అతిథులకు అందించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
‘డబుల్ ఎక్స్ఎల్’ చిత్రంలో ఈ జంట కలిసి నటించారు. ఆ సినిమా సెట్స్‌లోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, గత ఏడాది కాలంగా ఈ జంట ముంబయిలో సహజీవనం చేస్తున్నారని అంటున్నారు. కానీ ఈ విషయాన్ని వారు ఎక్కడా బహిరంగంగా బయటపెట్టలేదు. అయితే, ఇద్దరి సోషల్ మీడియా పోస్టులు చూస్తే వీరి ప్రేమ బంధం నిజమని అర్థమవుతుంది. ఇక ఈ నెల ఆరంభంలో సోనాక్షి పుట్టినరోజు సందర్భంగా జహీర్ కొన్ని అందమైన ఫొటోలను పంచుకున్నారు. ఆ ఫొటోలకు ‘హ్యాపీ బర్త్‌డే సోన్జ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక వీరి పెళ్లికి స్నేహితులు, కుటుంబ సభ్యులతోపాటు హీరామండి చిత్ర బృందం కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
నటుడు శత్రుఘ్న సిన్హా నటవారసురాలిగా సల్మాన్ నటించిన దబంగ్ సినిమాతో సోనాక్షి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక చివరిసారిగా సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో సోనాక్షి మెరిసింది. ఈ చిత్రంలో సోనాక్షితోపాటు మనీషా కోయిరాలా, రిచా చద్ధా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అతిది రావు హైదరి నటించారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read..
Bomb Threat | ఢిల్లీ – దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపులు
T20 World Cup: పూరన్ హిట్టింగ్.. 104 రన్స్ తేడాతో విండీస్ ఘన విజయం
YS Jagan | ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా..: వైఎస్ జగన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CBI Raids | రైస్ మిల్లర్లపై సీఐడీ దాడులు… నిజామాబాద్, కరీంనగర్, ములుగులో అక్రమాలు
RTC Conductor | కండక్టర్ ప్రాణం మీదికి తెచ్చిన ‘చిల్లర’.. భద్రాద్రి జిల్లాలో దారుణం
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

