Bomb Threat | ఢిల్లీ – దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపులు
Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్తున్న (Dubai bound plane) విమానానికి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం సృష్టించాయి.
Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్తున్న (Dubai bound plane) విమానానికి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం సృష్టించాయి. సోమవారం ఉదయం 9:35 గంటల సమయంలో దుబాయ్‌కి వెళ్లేందుకు విమానం ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌లో సిద్ధంగా ఉంది.
మరికాసేపట్లో టేకాఫ్ అవుతుందనంగ.. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఆఫీస్, ఐజీఐ (Indira Gandhi International Airport) ఎయిర్‌పోర్ట్‌కి విమానంలో బాంబు ఉందంటూ కొందరు వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపినట్లు ఢిల్లీ పోలీసులు (Delhi Police) మంగళవారం తెలిపారు. విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ చేసినట్లు చెప్పారు. బెదిరింపు మెయిల్‌తో ప్రొటోకాల్ ప్రకారం.. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదని వెల్లడించారు. అది బూటకపు మెయిల్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
YS Jagan | ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా..: వైఎస్ జగన్
T20 World Cup: పూరన్ హిట్టింగ్.. 104 రన్స్ తేడాతో విండీస్ ఘన విజయం
NDA-INDIA Bloc | ఉభయులకూ భవిష్యత్తు సవాళ్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

