న్యూయార్క్, ఏప్రిల్ 30 : భారత్ నుంచి అపహరించి అమెరికాకు తీసుకువచ్చిన పలు పురావస్తు కళాఖండాలను భారత్‌కు అమెరికా అప్పగించింది. పలు దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న 14 మిలియన్ డాలర్ల విలువైన 657 పురావస్తు కళాఖండాలను న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం భారత్‌కు అప్పగించింది.
న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ రాజ్‌లక్ష్మీ కడం హాజరైన ఒక కార్యక్రమంలో జిల్లా అటార్నీ అల్విన్ ఎల్ బ్రాగ జూనియర్ ఈ అప్పగింతను ప్రకటించారు. అక్రమ రవాణాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్ కపూర్, అక్రమ రవాణాలో దోషిగా తేలిన నాన్సీ వీనర్ల నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.