న్యూయార్క్, నవంబర్ 16: రూ. 84 కోట్ల విలువైన సుమారు 1440 పురాతన వస్తువులు, విగ్రహాలను భారత్కు తిరిగి ఇవ్వనున్నట్లు అమెరికాలోని మన్హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ ఎల్.బ్రాగ్గ్ జూనియర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ రవాణా నెట్వర్క్లపై చేపట్టిన దర్యాప్తులో వీటిని స్వాధీనం చేసుకున్నట్టు, ఇందులో అక్రమ రవాణాదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాశ్ కపూర్, నాన్సీ వినర్ల నుంచి సేకరించినవీ ఉన్నాయని తెలిపారు.
వీటిని భారత రాయబార కార్యాలయ అధికారి మనీశ్ కుల్హరికి అందజేస్తామని చెప్పారు. భారత్కు అప్పగించనున్న పురాతన వస్తువుల్లో మధ్యప్రదేశ్లోని ఒక ఆలయం నుంచి దోచుకున్న ఇసుకరాయితో చేసిన అందమైన నృత్యకారిణి శిల్పం, రాజస్థాన్లోని తానెసరా-మహదేవ గ్రామం నుంచి అపహరించిన తానెసర్ మాతృ దేవతా విగ్రహం ఉన్నాయి.