న్యూఢిల్లీ: హమాస్ రాజకీయవేత్త ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో.. ఇజ్రాయిల్‌పై దాడికి ఇరాన్ సిద్దమవుతున్నది. ఈ వారాంతంలో భారీ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాశ్చ్య ప్రాంతంలో యుద్ధ నౌకలను అమెరికా(US Military Ships) మోహరిస్తున్నది. టెహ్రాన్ చేపట్టే దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధనౌకలు, ఫైటర్ జెట్స్‌ను అమెరికా మోహరిస్తున్నది. అమెరికా సిబ్బందిని, ఇజ్రాయిల్‌ను డిఫెండ్ చేయాలన్న ఉద్దేశంతో పెంటగాన్ ఈ చర్యలకు దిగింది. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డెస్ట్రాయర్లను కూడా అమెరికా మోహరిస్తున్నట్లు పెంటగాన్ అధికారులు చెప్పారు.
భారతీయులకు అడ్వైజరీ..
టెల్ అవివ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ శుక్రవారం ఓ అడ్వైజరీ రిలీజ్ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సేఫ్టీ ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఉండాలని పేర్కొన్నది. ఎంబసీకి చెందిన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో అడ్వైజరీ పోస్టు చేశారు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేశారు. ఇద్దరు సీనియర్ హమాస్ నేతలతో పాటు హిజ్బుల్లా కమాండర్‌ను కూడా చంపిన ఘటన నేపథ్యంలో భారతీయ ఎంబసీ ఈ ప్రకటన ఇచ్చింది. టెలిఫోన్ నెంబర్లను కూడా రిలీజ్ చేశారు.
📢*IMPORTANT ADVISORY FOR INDIAN NATIONALS IN ISRAEL*
Link : https://t.co/OEsz3oUtBJ pic.twitter.com/COxuF3msn0
— India in Israel (@indemtel) August 2, 2024