Joe Biden | న్యూయార్క్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వైఖరిపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహూ అనుసరిస్తున్న వైఖరి ఇజ్రాయెల్‌కు మంచి చేయడం కంటే ఆ దేశాన్ని ఎక్కువగా గాయపరుస్తున్నదని వ్యాఖ్యానించారు.
‘నెతన్యాహూకు ఇజ్రాయెల్‌ను రక్షించుకునే హక్కు ఉంది. హమాస్‌పై పోరాటం చేసే హక్కు కూడా ఉంది. అయితే అతని చర్యల వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయన్న విషయంపై ఆయన మరింత దృష్టిసారించాలి’ అని బైడెన్ తెలిపారు.