Donald Trump | ఇరాన్‌తో చర్చలపై గుడ్‌న్యూస్ అన్న ట్రంప్.. రెండు రోజుల్లో చర్చలు జరిగే అవకాశం
Donald Trump : అమెరికా-ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చల కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చర్చలపై గుడ్ న్యూస్ అంటూ ట్రంప్ ప్రకటించారు. రెండు లేదా మూడు రోజుల్లో ఇరాన్‌తో చర్చలు ఉంటాయంటూ ట్రంప్ బుధవారం వెల్లడించారు.
Donald Trump : అమెరికా-ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చల కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చర్చలపై గుడ్ న్యూస్ అంటూ ట్రంప్ ప్రకటించారు. రెండు లేదా మూడు రోజుల్లో ఇరాన్‌తో చర్చలు ఉంటాయంటూ ట్రంప్ బుధవారం వెల్లడించారు. రాబోయే 36 నుంచి 72 గంటల్లో లేదా శుక్రవారం నాడు ఇరాన్‌తో రెండో దశ శాంతి చర్చలు జరుగుతాయని ట్రంప్ తెలిపారు. అంతకుముందు కూడా ట్రంప్.. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇరాన్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో.. పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకు ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నాడు. ఇరాన్ నాయకత్వం, ప్రతినిధులు కలిసి కొత్త ప్రతిపాదనతో వచ్చేంతవరకు వారికి సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా వెల్లడించాడు. అంతేకాదు.. అంతవరకు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని, కాల్పుల విరమణ పాటించాలని సూచించినట్లు తెలిపాడు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ పర్యటన కూడా వాయిదా పడింది. ఆయన శాంతి చర్చల కోసం మంగళవారమే పాక్ వెళ్లాల్సి ఉంది.
కానీ, ఇరాన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. మరోవైపు తమ నౌకల్ని అమెరికా బంధించడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని యుద్ధ నేరంగా అభిప్రాయపడింది. తమ దేశ వాణిజ్య నౌకలకు అడ్డుపడి, వాటిని అధీనంలోకి తీసుకోవడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అయితే, వీటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసంటూ ఇరాన్ ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

