న్యూయార్క్: కృత్రిమ మేధపై విధానాలను నిర్ణయించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దానికి సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ అని పేరు పెట్టారు. ఆదివారం తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపై ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థానం తమ ప్రభుత్వం సూపర్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ జే క్లేటన్ ఆ బృందానికి నాయకత్వం వహించనున్నట్లు చెప్పారు.
అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రజా ప్రయోజన గ్రూపులు, మౌళికరూపకర్తలు, ఏఐ కంపెనీల సహకారంతో సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ పనిచేస్తుందని ట్రంప్ తెలిపారు. ఎస్ఐఎఫ్ తన నివేదికను త్రివిధ దళాలతో పాటు దేశాధ్యక్షుడికి సమర్పిస్తుందనన్నారు. సూపర్ ఇంటెలిజెన్స్‌లో అమెరికా లీడింగ్‌లో ఉండాలన్న ఉద్దేశంతో ఆ దళాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. అమెరికా ప్రజల ప్రయోజనాలను రక్షిస్తామని, అలాగే దేశ ప్రజల జీవితాలను మెరుగుపరుస్తామన్నారు.
ఏఐ ఫోర్స్‌ను క్రియేట్ చేయనున్నట్లు గత నెలలో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కాస్త.. సూపర్ ఇంటెలిజెన్స్‌గా మార్చేశారు.