వాషింగ్టన్: విదేశీ విద్యార్థులు చదువు కోసం అమెరికాలో ఉండదగిన గరిష్ఠ కాల పరిమితిని నాలుగేండ్లుగా నిర్ణయించాలని అమెరికా ప్రభుత్వం బుధవారం ప్రతిపాదించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే గురువారం దాన్ని ప్రచురిస్తారు.
విదేశీ విద్యార్థులు సహా కొన్ని రకాల వీసాదారులు అమెరికాలో ఉండదగిన సమయంపై పరిమితి విధిస్తారు. వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం, ఇటువంటివారిని సరైన రీతిలో తనిఖీ చేయడం కోసం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు.