శాన్ డియోగో: అమెరికాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్ బుధవారం సముద్రంలో కూలిపోయింది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి టేకాఫ్ అయిన ఆ హెలికాప్టర్ శాన్ డియాగో దగ్గర సముద్రంలో కూలినట్లు యూఎస్ నేవీ ఒక ప్రకటనలో వెల్లడించింది. హెలికాప్టర్‌తోపాటు అందులోని సిబ్బంది కోసం గాలిస్తున్నట్లు చెప్పింది. ఎప్పటిలాగే ఫ్లైట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న సమయంలో శాన్ డియాగోకు 60 నాటికల్ మైళ్ల దూరంలో హెలికాప్టర్ కూలినట్లు పసిఫిక్ ఫ్లీట్ ట్వీట్ చేసింది.
Search and rescue operations are ongoing with multiple Coast Guard and Navy air and surface assets. More information will be posted as it becomes available. (2/2)
— U.S. Pacific Fleet (@USPacificFleet) September 1, 2021