America | అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. కాల్పుల్లో ముగ్గురు మృతి..!
America | అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తూటా పేలింది. వర్జీనియాలోని స్పాట్సిల్వేనియా కౌంటీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
America | అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తూటా పేలింది. వర్జీనియాలోని స్పాట్సిల్వేనియా కౌంటీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. స్పాట్సిల్వేనియా షెరీఫ్ కార్యాలయ ప్రతినిధి మేజర్ ఎలిజబెత్ స్కాట్ మాట్లాడుతూ వాషింగ్టన్ డీసీకి నైరుతి దిశలో 105 కిలోమీటర్లు దూరంలో ఉన్న స్పాట్సిల్వేనియా కౌంటీలోని ఓ నివాస సముదాయంలో సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగిందని తెలిపారు. ఆ తర్వాత 911 ద్వారా సమాచారం అందిందని.. వెంటనే అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించారని చెప్పారు. అనుమానితుల కోసం పోలీసులు వెతుకుతున్నారని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన చోట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని.. కాల్పులు జరిగిన ప్రాంతానికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

