Iranian ships | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇరాన్ నౌకలకు(Iranian ships) లైన్ క్లియర్ అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ ఓడరేవుల వద్ద విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఇరాన్ షరతులకు అంగీకరించడంతో ఎత్తివేసినట్లు ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఓ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
దీంతో అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. అయితే ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి అమెరికా యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో ఉంటాయని ఇరాన్ నౌకలకు ఎలాంటి ఆటంకం కలిగించవని సెంటకామ్ పేర్కొంది. హర్మూజ్‌లో నౌకల రాకపోకలకు లైన్ క్లియర్ అవడంతో 12.5 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగిందని వైట్ హౌస్ మీడియా సమావేశంలో ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ తెలిపారు.
అలాగే ఈ జలసంధి గుండా వెళ్లాలనుకునే నౌకలకు త్వరితగతిన అనుమతులు లభించేలా చూస్తామని, అయుద్ధ సమయంలో జలమార్గంలో అమర్చిన మందుపాతరలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటా మని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత ఇరాన్ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా నిబంధనలు ఉల్లంఘించినా లేనిపోని ఆంక్షలు విధించినా తమ స్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ హెచ్చరించారు.