న్యూయార్క్: బిలియనీర్ జెఫ్రీ ఎప్స్టీన్కు బర్త్‌డే సందర్భంగా డోనాల్డ్ ట్రంప్(Donald Trump) రాసిన లేఖను అమెరికా చట్టసభప్రతినిధులకు చెందిన హౌజ్ కమిటీ రిలీజ్ చేసింది. టీనేజ్ అమ్మాయిలను సెక్స్ ట్రాఫికింగ్ చేసిన కేసులో ఎప్స్టీన్ జైలు జీవితం అనుభవించి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఎప్స్టీన్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సంబంధాలు ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల ఓ కథనాన్ని రాసింది. ఆ కథనాన్ని ట్రంప్ కొట్టిపారేశారు. ఎప్స్టీన్తో తనకు సంబంధం లేదన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్‌పై పది బిలియన్ల డాలర్ల పరువునష్టం కేసు కూడా వేశారు. అయితే డోనాల్డ్ ట్రంప్ సంతకం చేసినట్లు ఉన్న ఓ లేఖను సోమవారం హౌజ్ కమిటీ రిలీజ్ చేసింది. దాంట్లో ఓ స్త్రీ రేఖాచిత్రంపై ట్రంప్, ఎప్స్టీన్ సంభాషణ ఉన్నది. లేఖ కింద భాగంలో ట్రంప్ సంతకం కూడా ఉన్నది. 2003లో ఎప్స్టీన్ 50వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ టైంలో ట్రంప్ ఆయనకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
🚨🚨HERE IT IS: We got Trump’s birthday note to Jeffrey Epstein that the President said doesn’t exist.
Trump talks about a “wonderful secret” the two of them shared. What is he hiding? Release the files! pic.twitter.com/k2Mq8Hu3LY
— Oversight Dems (@OversightDems) September 8, 2025
ఎప్స్టీన్ చాలా మంది రాజకీయవేత్తలు, సెలబ్రిటీలకు లేఖలు రాశాడు. వాటితో పాటు ఆయన వీలునామాకు చెందిన కాపీలను కూడా హౌజ్ కమిటీ రిలీజ్ చేసింది. ట్రంప్ సంతకం చేసినట్లు ఉన్న లేఖపై వైట్‌హౌజ్ స్పందించింది. ట్రంప్ ఆ బొమ్మ గీయలేదని, దానిపై ఆయన సంతకం చేయలేదని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. ట్రంప్‌కు చెందిన లీగల్ బృందం దీనిపై చర్యలు తీసుకుంటుందన్నారు.