US vs Iran | మేం శాంతి చర్చలకు సిద్ధం, చర్చలు విఫలమైతే యుద్ధానికీ సిద్ధం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
US vs Iran | ఖతార్ (Qatar) రాజధాని దోహా (Doha) వేదికగా అమెరికా (USA) తో కీలకమైన చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అగ్రరాజ్యానికి ఇరాన్ (Iran) గట్టి హెచ్చరికలు చేసింది. తాము దౌత్యపరమైన శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నామని, ఒకవేళ ఈ చర్చలు విఫలమై ఇచ్చిన మాట తప్పితే మాత్రం యుద్ధానికి కూడా సిద్ధమేనని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రధాన ప్రతినిధి మహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ (Mohammad Ghalibaf) స్పష్టంచేశారు.
US vs Iran : ఖతార్ (Qatar) రాజధాని దోహా (Doha) వేదికగా అమెరికా (USA) తో కీలకమైన చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అగ్రరాజ్యానికి ఇరాన్ (Iran) గట్టి హెచ్చరికలు చేసింది. తాము దౌత్యపరమైన శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నామని, ఒకవేళ ఈ చర్చలు విఫలమై ఇచ్చిన మాట తప్పితే మాత్రం యుద్ధానికి కూడా సిద్ధమేనని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రధాన ప్రతినిధి మహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ (Mohammad Ghalibaf) స్పష్టంచేశారు.
శుద్ధిచేసిన యురేనియంతో కూడిన తమ దేశ అణు హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అది ఇరాన్ విధించుకున్న ‘రెడ్ లైన్’ అని ఆయన తేల్చిచెప్పారు. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలోని కొన్ని కీలక నిబంధనలను పూర్తిగా అమలుచేసే వరకు తాము తదుపరి దశకు వెళ్లబోమని ఇరాన్ స్పష్టంచేసింది. ముఖ్యంగా లెబనాన్‌లో యుద్ధాన్ని ముగించి దాని సార్వభౌమత్వాన్ని కాపాడటం, ఇరాన్ చమురు ఎగుమతులు, అలాగే వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకల భద్రత వంటి అంశాలపై పట్టుబట్టింది.
గతంలో 2015 నాటి అణు ఒప్పందం విషయంలో అమెరికా ఇచ్చిన హామీలను ఉల్లంఘించిన తీరును గాలిబాఫ్ ఈ సందర్భంగా విమర్శించారు. లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాల సాధారణీకరణ కోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రయత్నిస్తున్నారని, ఇది ప్రస్తుత అవగాహన ఒప్పందానికి విరుద్ధమని ఆరోపించారు.
అమెరికా విధించిన ఆంక్షలు (బ్లాకేడ్) తొలగిపోయిన తర్వాత తమ దేశ చమురు ఎగుమతులు పెరిగాయని, ప్రస్తుతం 40 మిలియన్ బారెళ్లకు పైగా చమురును ఎగుమతి చేస్తున్నట్లు గాలిబాఫ్ వెల్లడించారు. ఖతార్ విదేశాంగ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మధ్యవర్తిత్వ చర్చలలో అమెరికా అధికారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు కూడా పాల్గొంటున్నారు. అవగాహన ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతోనే ఈ దోహా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ ఒకవైపు చర్చలకు వస్తూనే.. మరోవైపు సైనికపరంగా యుద్ధానికి సై అనడం అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

