వాషింగ్టన్: తమ దేశానికి చెందిన ఫైటర్ జెట్, హెలికాప్టర్ 30 నిమిషాల వ్యవధిలో దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయాయని యూఎస్ నేవీకి చెందిన పసిఫిక్ ఫ్లీట్ వెల్లడించింది. హెలికాప్టర్‌లోని ముగ్గురు సిబ్బందిని రక్షించామని, రెండు ఏవీయేటర్లను రికవరీ చేశామని తెలిపిం ది. అలాగే ఎఫ్/ఎ-18 ఫైటర్ జెట్‌లోని అయిదుగురు సురక్షితంగా ఉన్నారని పే ర్కొంది. ఈ రెండూ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. తాజా ఘటనతో కలిపి ఈ ఏడాదిలో యూఎస్ నేవీ నాలుగు ఎఫ్/ఎ-18 ఫైటర్ జెట్లను కోల్పోయింది.