భారత్ ప్రతిపాదనకు అమెరికా, ఫ్రాన్స్ మద్దతు
జెనీవా, మే 6: కరోనా వ్యాక్సిన్లను మేధోసంపత్తి (పేటెంట్) నిబంధనల నుంచి మినహాయించాలన్న భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు అమెరికా, ఫ్రాన్స్ మద్దతు ప్రకటించాయి. ఉత్పత్తులకు పేటెంట్ రక్షణలు ఉండాలనేదే తమ నిశ్చితాభిప్రాయమైనప్పటికీ… కరోనాను అంతం చేసేందుకు ఆ నిబంధనను సడలించాలని కోరుతున్నట్టు అమెరికా ప్రకటించింది. పేటెంట్‌ను రద్దు చేయడానికి తాను మద్దతు ఇస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తెలిపారు.