న్యూఢిల్లీ, మార్చి 31: ప్రీమియర్ ఎనర్జీస్..తెలంగాణలోని సీతారాంపూర్ వద్ద 5.6 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ యూనిట్‌ను ప్రారంభించింది. 75 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌తో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశీయ క్లీన్ ఎనర్జీ తయారీ రంగాన్ని ఊతమివ్వడానికి ఈ యూనిట్‌ను నెలకొల్పినట్టు కంపెనీ ఎండీ చిరంజీవి సాలుజా తెలిపారు. దీంతో కంపెనీ సామర్థ్యం 11.1 గిగావాట్లకు చేరుకున్నదన్నారు.