వాషింగ్టన్: యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) వినియోగదారులకు గురువారం ఓ హెచ్చరిక చేసింది. 19 రకాల వంట పాత్రల్లో వంట చేయడం వల్ల ఆహారంలోకి సీసం (లెడ్) చేరుతుందని తెలిపింది.
ఈ వంట పాత్రల్లో చాలా వరకు భారత దేశంలో తయారయ్యేవే. వీటిని అల్యూమినియం, అల్లాయ్స్తో తయారు చేస్తారు. ఎఫ్డీఏ భారత్లోని వివిధ కంపెనీలు తయారు చేసి, ఎగుమతి చేస్తున్న అల్యూమినియం కుక్వేర్ను ఎత్తి చూపింది.