Viral News | 130 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో జన్మించిన ఆడబిడ్డ..!
Viral News | ఆడపిల్ల పుట్టగానే బాధపడే వారు ఎక్కువగా ఉంటారు. అబ్బాయి పుట్టి ఉంటే బాగుండేది అని అనుకుంటారు. మరికొంతమంది ఆడపిల్లను ఇంటి మహాలక్ష్మిగా భావిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన దంపతులు (US Couples) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారేమో.. అక్కడే ఉంది అసలు కథ.
Viral News | ఆడపిల్ల పుట్టగానే బాధపడే వారు ఎక్కువగా ఉంటారు. అబ్బాయి పుట్టి ఉంటే బాగుండేది అని అనుకుంటారు. మరికొంతమంది ఆడపిల్లను ఇంటి మహాలక్ష్మిగా భావిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన దంపతులు (US Couples) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారేమో.. అక్కడే ఉంది అసలు కథ.
అమెరికా (America)కు చెందిన ఆండ్రూ క్లార్క్ (Andrew Clark), కరోలిన్ క్లార్క్ (Carolyn Clark) దంపతులు. వీరికి ఇప్పటికే ఒక మగబిడ్డ ఉన్నాడు. ఇటీవల ఈ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సారి అమ్మాయి (Baby Girl) పుట్టింది. దీంతో ఆ కుటుంబం ఆశ్చర్యానికి గురైంది. అమ్మాయి పుడితే ఆశ్చర్యం ఎందుకు అని అనుకుంటున్నారు కదూ..! ఎందుకంటే.. దాదాపుగా 130 ఏండ్లకుపైగా ఆండ్రూ కుటుంబంలో ఇప్పటి వరకూ అమ్మాయే పుట్టలేదంట. ఇలాంటి అరుదైన ఘటన జరిగితే ఎవరికి మాత్రం ఆశ్చర్యం వెయ్యదు చెప్పండి. ఆండ్రూ కుటుంబం కూడా అమ్మాయి పుట్టగానే ఆశ్చర్యపోయిందట మరి.
గుడ్ మార్నింగ్ అమెరికా (Good Morning America) కథనం ప్రకారం.. 1885 తర్వాత ఆండ్రూ కుటుంబంలో ఆడబిడ్డ పుట్టడం ఇదే తొలిసారి. ‘అమ్మాయి పుట్టడం మా అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది’ అని ఆండ్రూ చెప్పుకొచ్చాడు. అనంతరం కరోలిన్ మాట్లాడుతూ.. ‘పదేండ్ల క్రితం ఆండ్రూతో డేటింగ్ ప్రారంభించాను. అప్పుడు చాలా కాలంగా తమ కుటుంబంలో ఆడపిల్ల లేదని నా భర్త చెప్పాడు. అప్పుడు నేను నమ్మలేదు. ఈ విషయం గురించి ఆండ్రూ తల్లిదండ్రులను అడిగాను. వాళ్లు కూడా అదే చెప్పారు. వంద సంవత్సరాలకు పైగా ఆండ్రూ కుటుంబం తరఫున అమ్మాయి పుట్టలేదని వాళ్లు చెప్పాకే నాకూ తెలిసింది. అప్పుడు నేను షాక్ అయ్యాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 130 ఏండ్ల తర్వాత అమ్మాయి రాకతో కుటుంబమంతా చాలా సంతోషంగా ఉన్నట్లు ఆ జంట తెలిపింది.
Also Read..
Canada | కెనడాలో హిందూ దేవాలయంపై ద్వేషపూరిత రాతలు
Chicken Curry | చికెన్ కర్రీ కోసం గొడవ.. కోపంలో కొడుకు తల పగలగొట్టిన తండ్రి
Prakash Raj | సుదీప్ నిర్ణయంతో చాలా బాధపడ్డా : ప్రకాశ్ రాజ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

