మనందరిదీ ఒకే కుటుంబం
ఈ భూమి అత్యంత వైవిద్ధ్యంతో కూడినదని, అయితే మానవీయ విలువలు మనందరినీ ఏకం చేస్తున్నాయని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ చెప్పారు. మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారే అయినప్పటికీ, అందరూ ఒకటేనని గుర్తించగలిగే జ్ఞానం మనందరికీ ఉందని తెలిపారు.
- శ్రీశ్రీ రవిశంకర్
వాషింగ్టన్: ఈ భూమి అత్యంత వైవిద్ధ్యంతో కూడినదని, అయితే మానవీయ విలువలు మనందరినీ ఏకం చేస్తున్నాయని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ చెప్పారు. మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారే అయినప్పటికీ, అందరూ ఒకటేనని గుర్తించగలిగే జ్ఞానం మనందరికీ ఉందని తెలిపారు. మన జీవితాలను పండుగలా గడుపుదామని, సవాళ్లను స్వీకరించి, ధైర్యంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. మన కోసం, రాబోయే తరాల కోసం మరింత మెరుగైన భవిష్యత్తును ఆశిద్దామని చెప్పారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో జరుగుతున్న నాలుగో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు.
ఈ ఉత్సవాల తొలి రోజున జరిగిన కార్యక్రమాలను ప్రత్యక్షంగా దాదాపు 10 లక్షల మంది వీక్షించినట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రకటించింది. ఈ ఉత్సవాల్లో 180 దేశాల ప్రముఖ కళాకారులు పాల్గొన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని విభిన్న సంస్కృతుల సమాహారంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మానవాళిని మానవత్వం, శాంతి సందేశాలతో ఏకం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ఆచార్య లోకేశ్ ముని, ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, వాషింగ్టన్ డీసీ నగర మేయర్ మురియెల్ బౌసర్, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
భారతీయ ఆధ్యాత్మిక గురువులకు అమెరికా గుర్తింపు
ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక గురువులు శ్రీశ్రీ రవిశంకర్, ఆచార్య లోకేశ్ ముని ప్రపంచ శాంతి, సామరస్యాల కోసం గొప్ప కృషి చేస్తున్నట్లు అమెరికన్ కాంగ్రెస్ ప్రశంసించింది. శ్రీశ్రీ రవిశంకర్, ఆచార్య లోకేశ్ ముని సేవలను భారతీయ సంతతి ప్రతినిధి రాజా కృష్ణమూర్తి కొనియాడారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

