ఎంఎస్ వద్దు.. బీఎస్ ముద్దు

- బీఎస్ విద్యార్థులకే అమెరికా కంపెనీల ప్రాధాన్యం
- రెండు లక్షల డాలర్ల వరకు వేతనం ఇచ్చేందుకు రెడీ
- అందునా అమెరికాలో చదివిన వారివైపే మొగ్గు
- ఎంఎస్ గ్రాడ్యుయేట్లపై నిరాసక్తత.. వేతనాలూ తక్కువే
- అమెరికాలో మారుతున్న ఉన్నత చదువుల ట్రెండ్
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): అమెరికాలో చదువు.. అక్కడే పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగం.. చీకూచింతా లేని జీవితం.. ఇదీ ఎంతోమంది భారతీయ విద్యార్థుల రంగుల కల. అమెరికా యూనివర్సిటీల్లో చదివే మన విద్యార్థులకు మంచి డిమాండ్ కూడా ఉన్నది. ఉన్నత చదువులు చదివిన తెలివైన విద్యార్థులను ఎంత జీతమైనా ఇచ్చి ఎగరేసుకుపోయేందుకు అక్కడి కంపెనీలు పోటీ పడుతుంటాయి. సాధారణంగా సాఫ్ట్వేర్ వంటి ఉద్యోగాల్లో చేరేందుకు మన విద్యార్థులు అమెరికాలో మాస్టర్స్ ఇన్ సైన్స్ (ఎంఎస్) ఎక్కువ చదువుతుంటారు. ఆ అర్హత ఉన్నవారికి కంపెనీలు భారీగా వేతనాలు ఇవ్వటమే ఇందుకు కారణం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంఎస్ విద్యార్థులకంటే బ్యాచిలర్ ఇన్ సైన్స్ (బీఎస్) విద్యార్థులకే డిమాండ్ పెరిగింది. బీఎస్ వారికే కంపెనీలు ఎక్కువ వేతనాలు ఇస్తున్నాయి. వారినే ఏరికోరి రిక్రూట్ చేసుకొంటున్నాయి. ఎంఎస్ గ్రాడ్యుయేట్లకు 70 వేల డాలర్ల వరకు వార్షిక వేతనం ఇస్తుండగా, బీఎస్ వారికి గరిష్ఠంగా 1.3 లక్షల డాలర్ల వరకు ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నారు. కొన్ని కంపెనీలయితే ప్రతిభావంతులకు 2 లక్షల డాలర్ల వరకు వేతనాలిచ్చేందుకు ముందుకొస్తున్నాయి.
మారుతున్న పరిస్థితులు
- అమెరికా యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను బీఎస్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ఎంఎస్‌గా పిలుస్తారు. గతంలో ఎంఎస్‌లో చేరేందుకు మన విద్యార్థులు ఆసక్తిచూపేవారు. ఇప్పుడు బీఎస్ వారికి డిమాండ్ పెరుగుతున్నది.
- అమెరికాలో ఎంఎస్ చదవాలంటే మనదగ్గర నాలుగేండ్ల ఇంజినీరింగ్ కోర్సు చదివి ఉండాలి. అమెరికాలో ఎంఎస్ రెండేండ్లు ఉంటుంది.
- సబ్జెక్టు పరంగా బీఎస్ విద్యార్థులతో పోల్చితే ఎంఎస్ వారు వెనుకబడిపోతున్నారనే విమర్శ కూడా ఉన్నది. అందుకే మంచి ప్యాకేజీలు చేజిక్కించుకోలేకపోతున్నారు.
- యూఎస్ వెళ్లినవారిలో నాలుగు నుంచి 8 లక్షల మంది డబుల్ మాస్టర్స్ చేస్తున్నారు. మంచి ఉద్యోగావకాశాలు లేక ఇలా చదువుకొంటూ వెళ్తున్నారు. ఇలా సమయాన్ని వృథా చేసుకోవడమెందుకన్న భావనతో ఇప్పుడు అత్యధికులు బీఎస్ కోసమే యూఎస్ వెళ్తున్నారు.
- బీఎస్ పెట్రోలియం ఇంజినీరింగ్ పూర్తిచేసినవారికి కొన్ని కంపెనీలు ప్రారంభంలోనే 96 వేల డాలర్ల వార్షిక ప్యాకేజీలు ఇస్తున్నాయి. కాస్త అనుభవమున్నవారికి 1.72 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.
- సిస్టం ఇంజినీరింగ్వారికి ఏడాదికి 1.21 లక్షల డాలర్లు, కెమికల్ ఇంజినీరింగ్‌లో 1.19 లక్షల డాలర్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రంగంవారికి 1.15 లక్షల డాలర్ల వరకు వార్షిక ప్యాకేజీలిస్తున్నాయి.
- అమెరికాలో బీఎస్ స్థాయిలో నాణ్యమైన విద్య లభిస్తుండటం కూడా ట్రెండ్ మారటానికి కారణం అని నిపుణులు చెప్తున్నారు. మనదగ్గర ఇంజినీరింగ్ చేసి యూఎస్‌లో ఎంఎస్ చదివినా సబ్జెక్టుపై మంచి పట్టు లేకపోవటంతో వారి అవకాశాలను అందిపుచ్చుకోవటంలో వెనుకబడిపోతున్నారు.
- అమెరికాలో డిగ్రీ ప్రోగ్రాములకే విలువ ఎక్కువ. అక్కడిలో స్కూల్స్‌లో డిగ్రీ కోర్సులు అధికంగా ఉంటాయి. లోతైన విషయ పరిజ్ఞానాన్ని బీఎస్ కోర్సులు మాత్రమే అందించగలవు.
- స్కూల్స్, యూనివర్సిటీల్లో ల్యాబ్ వర్క్‌కు ప్రాధాన్యమిస్తారు. క్లాస్‌రూం టీచింగ్ తక్కువ, రీసెర్చ్ వర్క్ అధికంగా ఉంటుంది.
- యూఎస్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తికాగానే విద్యార్థులు నేరుగా పరిశ్రమలు స్థాపించేంత విషయ పరిజ్ఞానం ఇచ్చేలా విద్యావిధానాన్ని రూపొందించారు.
విషయ పరిజ్ఞానం మెండు
బ్యాచిలర్ పూర్తిచేసిన వారికి విషయ పరిజ్ఞానం అధికంగా ఉంటుంది. అందుకే మన విద్యార్థులు అమెరికా, కెనడాల్లో బీఎస్ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో మాస్టర్స్ కోర్సుల కోసం యూఎస్ వెళ్లేవారు. ఇప్పుడు ఇంటర్ పూర్తికాగానే అమెరికా వెళ్లాలనుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు.
– హరికాంత్‌రెడ్డి, డైరెక్టర్ ఎడు2టెక్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

