న్యూయార్క్: 140 కోట్ల మంది జనాభా ఉన్నామని భారత దేశం గప్పాలు కొడుతుందని, కనీసం ఒక గంపెడు అమెరికా జొన్నలను కొనదని అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ఆరోపించారు. భారత్ టారిఫ్లను తగ్గించాలని, లేదంటే అమెరికాతో వ్యాపారం చేయడంలో కష్ట కాలాన్ని ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు.
భారత దేశ ఆర్థిక వ్యవస్థను అమెరికాకు కట్టడి చేశారన్నారు. అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను భారత్ కోసం బార్లా తెరిచామన్నారు. “టారిఫ్లను తగ్గించండి. మేం మిమ్మల్ని చూసినట్లుగానే, మీరు మమ్మల్ని చూడండి” అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారన్నారు.