US bans Russia | ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా మీద అమెరికా భగ్గుమన్నది. మరిన్ని ఆంక్షలు విధించింది. అమెరికా బ్యాంకుల నుంచి రష్యా తన రుణ చెల్లింపులు జరుపకుండా నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. తాజాగా తీసుకున్న చర్యతో రష్యాకు ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయని అమెరికా ఆర్థికశాఖ స్పష్టం చేసింది. రష్యా తన డాలర్ల నిల్వలు తగ్గిపోవడంతో నూతన రెవెన్యూ వెతుక్కోవడమా.. డీఫాల్ట్‌గా మిగలడమా తేల్చుకోవాలని అమెరికా ఆర్థికశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాను కట్టడి చేయడానికి అమెరికా, దాని మిత్ర దేశాలు పలు రకాల ఆంక్షలు విధించింది. ముడి చమురుతోపాటు రష్యా నుంచి ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకోకుండా అమెరికా నిషేధం విధించింది. రష్యన్ బ్యాంకులను అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి అమెరికా, దాని మిత్ర దేశాలు బహిష్కరించాయి.