How US airman rescued? | ఇరాన్ భూభాగంలో రెండు రోజులు అమెరికా ఎయిర్‌మ్యాన్.. ఎలా రక్షించారంటే?
How US airman rescued? | ఇరాన్ దాడిలో కూలిన అమెరికా ఫైటర్ జెట్‌కు చెందిన ఎయిర్‌మ్యాన్ రెండు రోజుల పాటు శతృ భూభాగంలో ఉన్నాడు. అతికష్టంగా 7,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. చివరకు అతడి లోకేషన్‌ను గుర్తించిన అమెరికా మిలిటరీ సాహసోపేతమైన నైట్ మిషన్‌లో కాపాడినట్లు అమెరికా అధికారి తెలిపారు.
వాషింగ్టన్: ఇరాన్ దాడిలో కూలిన అమెరికా ఫైటర్ జెట్‌కు చెందిన ఎయిర్‌మ్యాన్ రెండు రోజుల పాటు శతృ భూభాగంలో ఉన్నాడు. అతికష్టంగా 7,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. చివరకు అతడి లోకేషన్‌ను గుర్తించిన అమెరికా మిలిటరీ సాహసోపేతమైన నైట్ మిషన్‌లో కాపాడినట్లు అమెరికా అధికారి తెలిపారు. (US airman rescued) ఏప్రిల్ 3 తెల్లవారుజామున ఇరాన్ దాడిలో అమెరికా ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూలిపోయింది. అందులోని ఇద్దరు సిబ్బంది విమానం నుంచి బయటకు దూకేశారు. కొన్ని గంటల తర్వాత ఒక పైలట్ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. మరో సిబ్బంది జాడ కనిపించలేదు.
కాగా, కూలిపోయిన జెట్ నుంచి బయటపడిన అమెరికా ఎయిర్‌మ్యాన్ ఇరాన్ సరిహద్దులోని కొండ ప్రాంతంలో పడిపోయాడు. కల్నల్ అయిన ఆ అధికారి వద్ద ప్రాణరక్షణ ఆహార సామాగ్రి, చేతి తుపాకీ, ఒక బీకన్, సురక్షిత కమ్యూనికేషన్ పరికరం ఉన్నాయి. కూలిన విమానం శకలాలకు దూరంగా అతడు వెళ్లాడు. కొండ పగుళ్లలో తలదాచుకున్నాడు. దీంతో ఆ ఎయిర్‌మ్యాన్ ఎక్కడ ఉన్నాడో అన్నది అమెరికా బలగాలకు గానీ, ఇరాన్ బలగాలకు గానీ తెలియలేదు.
మరోవైపు అమెరికా ఎయిర్‌మ్యాన్ కోసం ఐఆర్జీసీ, బసిజ్ పారామిలిటరీ దళాలతో సహా ఇరాన్ బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ ‘శత్రు పైలట్’ను గుర్తించడంలో సహాయపడాలని ఇరాన్ ప్రభుత్వం తన పౌరులకు బహిరంగంగా పిలుపునిచ్చింది. అతడ్ని పట్టుకున్నా, లేక చంపినా బహుమతి ఇస్తామని కూడా ప్రకటించింది.
కాగా, ఇరాన్ సరిహద్దులోని కొండ ప్రాంతంలో రెండు రోజులు పాటు అమెరికా కల్నల్ ఉన్నాడు. అతి కష్టం మీద 7,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. తన కోసం వెతుకుతున్న ఇరాన్ సైన్యం కంటపడకుండా జాగ్రత్త వహించాడు. తన ఉనికిని తెలిపే బీకన్ను అరుదుగా ఉపయోగించాడు. తన వద్ద ఉన్న కమ్యూనికేషన్ పరికరం ద్వారా అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సీఐఏ)ను సంప్రదించాడు.
మరోవైపు ఆ కల్నల్ ఉన్న ఖచ్చిత ప్రాంతాన్ని గుర్తించిన సీఐఏ, పెంటగాన్, వైట్‌హౌస్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో అధ్యక్షుడు ట్రంప్ తక్షణమే రెస్క్యూ మిషన్‌కు ఆదేశించారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి తర్వాత పలు యుద్ధ విమానాలతో చేపట్టిన సాససోపేత రెస్క్యూమిషన్లో ఆ కల్నల్‌ను రక్షించినట్లు అమెరికా అధికారి తెలిపారు.
అలాగే ఇరాన్ బలగాలను తప్పుదారిపట్టేందుకు సీఐఏ ఒక సైకలాజికల్ వార్ కూడా చేసిందని న్యూయార్క్ టైమ్స్‌కు ఆయన చెప్పారు. ఆ ఎయిర్‌మ్యాన్ ఆచూకీని గుర్తించి భూమార్గంలో తరలించినట్లుగా మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ అమెరికా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
Also Read:
Donald Trump | హార్ముజ్ జలసంధిని తెరవండి.. ఇరాన్‌పై బూతులతో రెచ్చిపోయిన ట్రంప్
Gulf Countries | ఇవాళ ఒక్కరోజే యూఏఈ నుంచి భారత్‌కు 90 ప్రత్యేక విమానాలు..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

