Donald Trump | హార్ముజ్ జలసంధిని తెరవండి.. ఇరాన్‌పై బూతులతో రెచ్చిపోయిన ట్రంప్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై బూతులతో రెచ్చిపోయారు. తాను ఎంతగా హెచ్చరించినా హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకపోవడంతో ట్రంప్ తీవ్ర ఆవేశానికి లోనయ్యారు.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై బూతులతో రెచ్చిపోయారు. తాను ఎంతగా హెచ్చరించినా హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకపోవడంతో ట్రంప్ తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ వేదికగా ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్‌పై భీకర దాడులు తప్పవని హెచ్చరించారు.
‘‘మంగళవారం పవర్ ప్లాంట్ డే. బ్రిడ్జి డే. అన్నీ కలిపి ఇరాన్‌లోనే జరుగుతాయి. దీనికేదీ సాటిరాదు. హార్ముజ్ జలసంధిని తెరవండి. లేకుంటే ఇరాన్లో కాదు. నరకంలో ఉన్నట్లే. చూస్తూ ఉండండి. అల్లాను ప్రార్థించండి’’ అంటూ ట్రంప్ పేర్కొన్నాడు. అంతేకాదు.. వర్ణించలేని బూతు పదాల్ని వాడాడు. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందే అని ఇరాన్‌కు ఇప్పటికే ట్రంప్ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. తాను చెప్పినట్లు చేయకపోతే ఇరాన్‌లోని బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికను ఇరాన్ తేలికగా తీసుకుంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ కూడా కువైట్, బహ్రెయిన్‌లోని చమురు కేంద్రాలపై దాడులు చేస్తోంది.
అలాగే, తమ దేశంలోని పౌర కేంద్రాలపై దాడులు చేస్తే తాము కూడా మరింత బలంగా దాడి చేస్తామని హెచ్చరించింది. ఇంకోవైపు ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ రాజధాని అయిన బీరుట్‌పై దాడులు చేస్తున్నాయి. అలాగే, ఆదివారం అమెరికాకు చెందిన యుద్ధ విమానాల్ని కూల్చివేశామని ఇరాన్ తెలిపింది. సీ-130 అనే రెండు రవాణా విమానాల్ని, రెండు బ్లాక్ హ్యాక్ అనే హెలికాప్టర్లను కూల్చినట్లు తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

