US destroys own warplanes | పైలట్ రెస్క్యూ సందర్భంగా.. సొంత యుద్ధ విమానాలను ధ్వంసం చేసుకున్నాం: అమెరికా
US destroys own warplanes | ఇరాన్ కూల్చేసిన ఫైటర్ జెట్ పైలట్ రక్షణ సందర్భంగా రెండు సొంత యుద్ధ విమానాలను ధ్వంసం చేసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే వాటిని తామే కూల్చినట్లు ఆధారాలను ఇరాన్ చూపించింది.
వాషింగ్టన్: ఇరాన్ కూల్చేసిన ఫైటర్ జెట్ పైలట్ రక్షణ సందర్భంగా రెండు సొంత యుద్ధ విమానాలను ధ్వంసం చేసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే వాటిని తామే కూల్చినట్లు ఆధారాలను ఇరాన్ చూపించింది. (US destroys own warplanes) ఏప్రిల్ 3న తెల్లవారుజామున ఇరాన్ దాడిలో అమెరికా ఫైటర్ జెట్ కూలిపోయింది. పారాచూట్ సహాయంతో ఒక పైలట్ సురక్షితంగా చేరుకున్నాడు. ఆ యుద్ధ విమానంలో ఉన్న మరో అమెరికా వైమానిక దళ అధికారి ఇరాన్ సరిహద్దులోని కొండల్లో పడిపోయాడు.
కాగా, ఆ పైలట్‌ను రక్షించేందుకు అమెరికా మిలిటరీ సాససోపేత మిషన్ చేపట్టింది. శనివారం అర్ధరాత్రి వేళ పలు యుద్ధ విమానాలు, రవాణా యుద్ధ విమానాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. రెండు రోజులు శ్రమించి కొండ ప్రాంతం పైకి చేరుకున్న అమెరికా వైమానిక అధికారిని సురక్షితంగా కాపాడింది. ఈ సాహసోపేతమైన నైట్ మిషన్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పలుపోయారు.
మరోవైపు అమెరికా అధికారి ఒకరు ఈ మిషన్ గురించి వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడారు. పైలట్ రక్షణ సందర్భంగా అమెరికా దళాలు తమ సొంత యుద్ధ విమానాలను పేల్చివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న రెండు ఎంసీ-130 జే రవాణా విమానాలు అక్కడ చిక్కుకున్నట్లు చెప్పారు. ఆ రెండు యుద్ధ విమానాలు ఇరాన్ చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు వాటిని ధ్వంసం చేయడం అవసరమైందని ఆ అధికారి వెల్లడించారు.
అయితే అమెరికా అధికారి స్టేట్మెంట్ను ఇరాన్ ఖండిచింది. రెండు ఎంసీ-130 జే రవాణా విమానాలను తామే కూల్చినట్లు ప్రకటించింది. ధ్వంసమైన వాటి ఫొటోలను ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘అమెరికాకు ఇలాంటి విజయాలు మరో మూడు లభిస్తే, అది పూర్తిగా నాశనమైపోతుంది’ అని పేర్కొన్నారు.
Also Read:
Donald Trump | గల్లంతైన పైలట్‌ను రక్షించాం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
US-Iran War | అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ సైనిక నేతలు మృతి.. ట్రంప్ వెల్లడి
Iran | అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టిగా షాకిస్తాం.. వార్నింగ్ ఇచ్చిన ఇరాన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

