Iran | అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టిగా షాకిస్తాం.. వార్నింగ్ ఇచ్చిన ఇరాన్
Iran | పశ్చిమాసియా (West Asia) లో పోరు రోజురోజుకి తీవ్రమవుతున్నది. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్ (US, Israel) దేశాలకు ఇరాన్ (Iran) గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆ రెండు దేశాలకు త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ (Big Surprise) ఇవ్వనున్నామని ఇరాన్ భద్రతాధికారి ఒకరు వెల్లడించారు.
Iran : పశ్చిమాసియా (West Asia) లో పోరు రోజురోజుకి తీవ్రమవుతున్నది. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్ (US, Israel) దేశాలకు ఇరాన్ (Iran) గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆ రెండు దేశాలకు త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ (Big Surprise) ఇవ్వనున్నామని ఇరాన్ భద్రతాధికారి ఒకరు వెల్లడించారు. ఇరాన్ తన సొంత ప్రణాళికలు, నిర్దిష్ట లక్ష్యాల ప్రకారమే యుద్ధాన్ని కొనసాగిస్తోందని సదరు భద్రతాధికారి తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికా, ఇజ్రాయెల్‌కు ‘బిగ్ సర్ప్రైజ్’ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా అమెరికా లక్ష్యాల జాబితా లోపభూయిష్టంగా ఉందని ఇరాన్ భద్రతాధికారి ఎద్దేవాచేశారు. ఇరాన్ వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న బెదిరింపులు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేయడం గురించి ప్రస్తావిస్తూ.. వారి సైనిక చర్యలు విఫలమయ్యాయన్నారు. ఇదిలావుండగా 48 గంటల్లోగా హర్మూజ్‌ను తెరవాలంటూ ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం జారీచేశారు. లేదంటే నరకం చూపిస్తామని ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ బెదిరింపులపై కూడా తాజాగా ఇరాన్ స్పందించింది. ట్రంప్ హెచ్చరికను తెలివితక్కువ చర్యగా అభివర్ణించింది. ఇరాన్ జనరల్ అలీ అబ్దుల్లాహి మీడియాతో మాట్లాడుతూ.. శత్రువులు తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

