Gulf Countries | ఇవాళ ఒక్కరోజే యూఏఈ నుంచి భారత్కు 90 ప్రత్యేక విమానాలు..!
Gulf Countries | గల్ఫ్ ప్రాంతం (Gulf region) నుంచి భారత్ (India) కు విమాన సర్వీసుల రాకపోకలు మెరుగుపడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే యూఏఈ (UAE) నుంచి 90 ప్రత్యేక విమానాలు భారత్కు చేరుకున్నాయి. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. సౌదీ అరేబియా (Saudi Arabia), ఒమన్ (Oman) నుంచి కూడా విమానాలు నడుస్తున్నాయి.
Gulf Countries : గల్ఫ్ ప్రాంతం (Gulf region) నుంచి భారత్ (India) కు విమాన సర్వీసుల రాకపోకలు మెరుగుపడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే యూఏఈ (UAE) నుంచి 90 ప్రత్యేక విమానాలు భారత్కు చేరుకున్నాయి. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. సౌదీ అరేబియా (Saudi Arabia), ఒమన్ (Oman) నుంచి కూడా విమానాలు నడుస్తున్నాయి. ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో అక్కడి నుంచి 8 నుంచి 10 విమానాలు వచ్చే అవకాశం ఉంది. కువైట్, బహ్రెయిన్ దేశాల్లో గగనతలాలను మూసివేసినప్పటికీ, సౌదీ అరేబియాలోని దమ్మామ్ మీదుగా ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
అదేవిధంగా, ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్, జోర్డాన్ మీదుగా, ఇరాక్ నుంచి జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా భారతీయులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇరాన్ నుంచి ప్రయాణాలను అర్మేనియా, అజర్బైజాన్ ద్వారా సులభతరం చేస్తున్నారు. ఇటీవల ఒమన్ తీరంలో నౌకపై జరిగిన దాడిలో మరణించిన భారత నావికుడి పార్థివదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చారు. ఆయన కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఇరాన్లో చిక్కుకుపోయిన 345 మంది భారత జాలర్లు శనివారం సురక్షితంగా చెన్నైకి చేరుకున్నారు.
గల్ఫ్, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులను విదేశాంగ మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది. భారతీయుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టంచేసింది. ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను, 24 గంటల హెల్ప్లైన్లను నిర్వహిస్తున్నారు. అక్కడి భారత రాయబార కార్యాలయాలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులు, నౌక సిబ్బందికి కూడా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

