వాషింగ్టన్: అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్ చట్టరీత్యా నేరం. కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉంది. అబార్షన్ కోసం ఎక్కువగా మిఫిప్రాస్టాన్(Mifepristone) మాత్రలను వేసుకుంటారు. ఈ గర్భనిరోధక మాత్రలపై తాజాగా ఆ దేశంలోని రెండు కోర్టులు భిన్న తీర్పులను వెలువరించాయి. టెక్సాస్‌లో ఫెడరల్ జడ్జి గర్భనిరోధక మాత్రల(Abortion Pills)పై నిషేధాన్ని ప్రకటించారు. మరో వైపు వాషింగ్టన్ కోర్టు మాత్రం ఆ అబార్షన్ పిల్ కనీసం 12 రాష్ట్రాల్లో అందుబాటులో ఉండేలా చర్యలను తీసుకోవాలని ఆదేశించింది. దీంతో గర్భనిరోధక మాత్రలపై సందిగ్ధత నెలకొన్నది. మిఫిప్రిస్టోన్ గురించి ఏడాది నుంచి అమెరికా కోర్టులో తీవ్ర స్థాయిలో వాదనలు జరుగుతూనే ఉన్నాయి.
గర్భనిరోధక మాత్రలు..
అమెరికాలో 2020లో సుమారు 10 లక్షల మంది మహిళల వరకు అబార్షన్ చేయించుకున్నారు. గట్మాచర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం దాంట్లో 53 శాతం మంది మిఫిప్రిస్టాన్ పిల్స్తోనే గర్భాన్ని తొలిగించుకున్నారు. ఈ మాత్రల వినియోగం 2008లో 17 శాతం ఉండేది. 2017 నాటికి ఆ మాత్రల వాడకం 39 శాతానికి పెరిగింది. ఫ్రాన్స్‌లో 2020లో దాదాపు 70 శాతం అబార్షన్లు మెడికల్ ప్రక్రియలో జరిగాయి. అయితే ఆ రీతిలోనే అమెరికాలో గర్భాల తొలగింపు ప్రక్రియ సాగుతున్నది.
ఆ మాత్రలు ఎలా పనిచేస్తాయి..
మహిళలు శృంగారం చేసిన తర్వాత .. గర్భం దాల్చకుండా ఉండేందుకు అబార్షన్ మాత్రలు వేసుకుంటారు. మిఫిప్రిస్టోన్ను ఆర్యూ 486గా కూడా పిలుస్తారు. ఈ మాత్రలను వేసుకుంటే.. ప్రొజెస్ట్రోన్ హార్మోన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. దీంతో ప్రెగ్నెన్సీ అడ్డుకునే ఛాన్సు ఉంది. ఇక మిసోప్రోస్టాల్ అనే మరో మాత్రను కూడా కొందరు వేసుకుంటారు. సంగమం తర్వాత 48 గంటలు దాటాకా ఈ మాత్రను వాడుతారు. దీని వల్ల బ్లీడింగ్ జరిగి..గర్భాశయ ప్రదేశం అంతా ఖాళీ అవుతుంది. అబార్షన్ పిల్స్‌ను ఇంటి వద్దే వాడవచ్చు. పెద్దగా మెడికల్ సెట్టింగ్ అవసరం లేదు.
అబార్షన్ పిల్‌ను ఎప్పుడు ఆమోదించారు..
అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్.. మిఫిస్ట్రాన్, మిసోప్రోస్టోల్‌కు 2000 సంవత్సరంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. గర్భం కన్ఫార్మ్ అయిన 10 వారాల వ్యవధి వరకు ఈ మాత్రలను వాడవచ్చు. ఒకవేళ ఆ సమయం దాటితే, అప్పుడు వాక్యూమ్ యాస్పిరేషన్ పద్ధతిలో గర్భాన్ని తొలగిస్తారు. అమెరికాలో అబార్షన్ ఖర్చు సగటున 580 డాలర్లు ఉంటుంది. ఎక్కువలో ఎక్కువగా ఆ ఖర్చు 800 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంటుంది.
ఎంత వరకు సురక్షితం.. ప్రభావంతం ?
అబార్షన్ పిల్‌ను నిర్దేశిత సమయం ప్రకారం తీసుకుంటే దాని వల్ల సురక్షిత రీతిలో గర్భాన్ని తొలగించుకునే వీలు ఉంటుంది. అబార్షన్ మాత్రలు ప్రభావంతంగా పనిచేయనున్నట్లు మెడికల్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధ్యయన నివేదికల ద్వారా.. పిల్ వాడిన 95 కేసుల్లో ప్రెగ్నెన్సీ దాదాపు టర్మినేట్ అవుతుంది. కొన్ని కేసుల్లో అధికంగా బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంది.
ఆ మాత్రలు ఎక్కడ దొరుకుతాయి?
అమెరికాలో కనీసం 13 రాష్ట్రాల్లో అబార్షన్ మాత్రల్ని బ్యాన్ చేశారు. రాజ్యాంగం ప్రకారం అబార్షన్ హక్కు ఉన్నా.. గత జూన్ నుంచి కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆ మాత్రల్ని అమ్మడం లేదు. ఇక చట్టపరమైన అనుమతి ఉన్న రాష్ట్రాల్లో మిఫిప్రిస్టోన్ మాత్రల్ని ప్రస్తుతం ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు. ఫార్మసీల్లోనూ ప్రిస్క్రిప్షన్ చూపిస్తే ఇచ్చేస్తారు.