రియాద్ : సౌదీ అరేబియా ప్రభుత్వం ఉమ్రా వీసా చెల్లుబాటును మూడు నెలల నుంచి 30 రోజులకు కుదించింది. ఈ నిబంధన వచ్చే వారం నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. మక్కా, మదీనాలకు వచ్చే పర్యాటకులు పెరుగుతున్న నేపథ్యంలో వారి సంఖ్యను క్రమబద్ధీకరించేందుకే ఈ నిబంధనను తెచ్చినట్టు పేర్కొంది.
కొత్త నిబంధన ప్రకారం వీసా జారీ అయిన రోజు నుంచి 30 రోజుల్లోగా సౌదీలో ప్రవేశించాలి లేదా రద్దయిపోతుంది. ఈ 30 రోజుల్లోపే ఓ పర్యాటకుడు సౌదీలో ప్రవేశిస్తే.. ఆ తరువాత మూడు నెలల వరకు ఆ దేశంలో ఉండేందుకు అనుమతిస్తారు.