మాస్కో: రష్యాలోని సరతోవ్ ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాల్లోకి ఉక్రెయిన్ డ్రోన్లు (Ukrainian Drones)దూసుకొచ్చాయి. భారీ బిల్డింగ్‌లను కమికేజ్ డ్రోన్లు ఢీకొట్టాయి. ఈ విషయాన్ని గవర్నర్ రోమన్ బుసర్జిన్ తెలిపారు. ఉక్రెయిన్ దాడి పట్ల వైమానిక దళాలు ప్రతిస్పందించినట్లు పేర్కొన్నారు. సరతోవ్, ఇంజెల్స్ పట్టణాల్లో డ్రోన్ శిథిలాలు కూలినట్లు బుసర్జిన్ తెలిపారు. 38 అంతస్తుల ఓ బిల్డింగ్‌ను డ్రోన్ ఢీకొట్టింది. పది లక్షల మంది నివసించే సరతోవ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. డ్రోన్ దాడికి చెందిన వీడియోను టెలిగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. ఈ దాడి వల్ల నలుగురు గాయపడ్డారు. ఓ మహిళ ఆరోగ్యం క్రిటికల్‌గా ఉంది. ఇంజెల్స్ పట్టణంలో కూడా ఓ అపార్ట్మెంట్ బ్లాక్‌లోకి యూఏవీ దూసుకొచ్చింది. అయితే ఆ బిల్డింగ్, డ్రోన్ శిథిలాల వల్ల పార్కింగ్లోని కార్లు డ్యామేజ్ అయ్యాయి. ఆదివారం రాత్రి సుమారు 20 డ్రోన్లను తిప్పికొట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.