హైదరాబాద్: ఉక్రెయిన్పై రష్యాలు దాడుల్లో మరో కళాకారుడు మృతిచెందాడు. గురువారం కీవ్లోని ఓ బిల్డింగ్పై రష్యా సేనలు చేసిన రాకెట్ దాడిలో ప్రముఖ నటి ఒక్సానా షెవెట్స్ మృత్యువాతపడ్డారు. తాజాగా ఉక్రెయిన్ టాప్ బ్యాలెట్ డ్యాన్సర్ అర్టియోమ్ దట్సిషిన్ (Artyom Datsishin) మృతిచెందాడు. ఫిబ్రవరి 26న రష్యా సైనికులు జరిపిన దాడిలో అర్టియోమ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే పరిస్థితి విషమిండంతో కీవ్లోని దవాఖానలో చనిపోయాడని నేషనల్ ఒపెరా హౌస్ ఆఫ్ ఉక్రెయిన్ అధికారులు ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు.
కాగా, గురువారం నాటి దాడుల్లో ప్రముఖ నటి ఒక్సానా షెవెట్స్ మరణించిన విషయం తెలిసింది. ఉక్రెయిన్లో కొన్ని దశాబ్దాలకాలంగా వెండితెరపై వెలిగిన ఒక్సానా.. థియేటర్ కళాకారిణిగా, నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. దేశంలోని అత్యున్నత పురస్కారాలను సొంతం చేసుకొన్నారు.