కీవ్: రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడి చేసేందుకు సమీపిస్తున్నాయి. మరో వైపు ఆ నగర ప్రజలు మొలటోవ్ కాక్టేల్ బాంబులను సిద్ధం చేస్తున్నారు. మొటటోవ్ కాక్టేల్ బాంబులను పెట్రోల్ బాంబులు అంటారు. ఉక్రెయిన్ మహిళలు ఆ బాంబులను తయారీ చేస్తున్నారు. అయితే తాజాగా కీవ్ సమీపంలో డ్రోన్ ద్వారా ఆ బాంబులను వాడారు. దూసుకువస్తున్న రష్యా బలగాలపై దాడి కోసం డ్రోన్ ద్వారా పెట్రోల్ బాంబులు వదలనున్నారు. ఉక్రెయిన్ రక్షణ దళాలు ఈ డ్రోన్‌ను డెవలప్ చేశాయి. తమ వద్ద ఉన్న డ్రోన్లను ఇవ్వాలని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఆదేశాలు జారీ చేసింది.
బీరు బాటిళ్లలో నింపిన పెట్రోల్, ఇతర పదార్థాలకు నిప్పు అంటించిన తర్వాత వాటిని శత్రువులపై విసిరి వేస్తారు. కానీ డ్రోన్ ద్వారా వదిలే మొలటోవ్ కాక్టేల్ బాటిల్ ఎలా పేలుతుందో స్పష్టంగా తెలియదు. కానీ డ్రోన్ నుంచి కిందకు పడుతున్న సమయంలో బాటిల్ నుంచి ఎటువంటి ద్రవం జారిపడడంలేదు. టార్గెట్‌ను చేరుకున్న తర్వాతే కాక్టేల్ బాంబు పేలుతున్నట్లు గుర్తించారు. కీవ్‌ను సమీపిస్తున్న రష్యా బలగాలపై కురిసేందుకు డ్రోన్ బాంబులు సిద్ధంగా ఉన్నాయి.