ఉక్రెయిన్: యుద్ధభూమి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌లోని ప్రధాన పట్టణాలపై రష్యన్ బలగాలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా (US) సహా నాటో దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశేలా అనేక ఆంక్షలు విధించాయి. ఈ యుద్ధంలో అమెరికా సహా నాటో దేశాలు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ.. ఉక్రెయిన్‌కు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాయి. నేరుగా సైనికులను రణక్షేత్రంలోకి పంపించకపోయినా.. ఆ దేశ సైనికులకు పూర్తిస్థాయిలో సహాయాన్ని అందిస్తున్నాయి. ఆయుధ సమాగ్రి, యుద్ధ వాహనాలను పంపిస్తున్నాయి.
ఈ క్రమంలో అమెరికా నుంచి మరికొన్ని రోజుల్లో భారీ సంఖ్యలో ఆయుధాలు రానున్నాయని ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్రెటరీ ఒలెస్కీ డానిలోవ్ చెప్పారు. ఇందులో ట్యాంక్ విధ్వంసక మిస్సైల్ జావెలిన్, స్టింగర్ మిస్సైల్స్ కూడా ఉన్నాయని వెల్లడించారు. సమీప భవిష్యత్తులో అంటే రోజుల వ్యవధిలోనే అమెరికా నుంచి ఆయుధాలు దేశానికి వస్తాయని ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించారు.
ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన దేశాలు భారీ సంఖ్యలో ఆయుధాలను పంపిస్తున్నాయి. నాటో సభ్య దేశాలు ఆయుధాలను సప్లయ్ చేయడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తమ ఇరుదేశాల వ్యవహారంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించింది.