ఉక్రెయిన్, రష్యా మధ్య పోరాటం చాలా రోజులుగా సాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ.. రష్యన్ తల్లులకు సందేశం ఇచ్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి తమ పిల్లలను పంపొద్దని వారికి ఆయన సలహా ఇచ్చారు. ‘‘రష్యన్ తల్లులారా.. ముఖ్యంగా రష్యన్ సైనికుల తల్లులారా’’ అంటూ జెలెన్స్కీ మాట్లాడారు.
‘‘మీ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి. వారిని పరాయి దేశంతో యుద్ధానికి పంపకండి’’ అని పిలుపునిచ్చారు. ‘‘మీ పిల్లలు ఎక్కడున్నారో ఆరా తీయండి. వాళ్లను ఉక్రెయిన్‌పై యుద్ధానికి పంపే అవకాశం ఉందని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే చర్యలు తీసుకోండి. వారిని యుద్ధానికి వెళ్లకుండా అడ్డుకోండి’’ అని జెలెన్స్కీ సూచించారు.
లేదంటే సదరు సైనికులు చనిపోవడమో లేదంటే బందీలుగా మారడమో జరుగుతుందని, అలాంటి ఘోరం జరగకుండా పిల్లలను కాపాడుకోవాలని రష్యన్ తల్లులకు సలహా ఇచ్చారు.