మాస్కో : రష్యా దాడిలో ఉక్రెయిన్ నావికా దళంలోని అత్యంత భారీ నౌక సిమ్ఫెరోపోల్ మునిగిపోయింది. ఈ నౌకను ఓ దశాబ్దం క్రితం నావికా దళంలో ప్రవేశపెట్టారు. దీనిని నావల్ డ్రోన్‌తో రష్యా ముంచేసింది. డాన్యూబ్ నది డెల్టాలో దీనిపై దాడి జరిగింది. మధ్య స్థాయికి చెందిన ఈ నౌక లగునా క్లాస్‌కు చెందినది.
రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్ ఆప్టికల్ రికనైసెన్స్ నిఘా సమాచార సేకరణ కోసం ఈ నౌకను డిజైన్ చేశారు. ఉక్రెయిన్ అధికారులు కూడా ఈ నౌకపై దాడి జరిగినట్లు ధ్రువీకరించారు. ఈ దాడిలో సిబ్బంది ఒకరు మరణించారని తెలిపారు.